Current Date: 05 Oct, 2024

380 అడుగుల ఎత్తయిన జలపాతం అంచున పడుకొని మరీ వీడియో...

పిచ్చి పలురకాలు వెర్రి వేయి విధాలు అంటే ఇదేనేమోఫొటోలు, వీడియోల కోసం కొందరు  వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమని తెలిసినా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 380 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతున్న భారీ జలపాతం అంచున పడుకొని ఓ మహిళా టూరిస్ట్ జలకాలాడిన వీడియో ఒకటి నెట్టింట మళ్లీ చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాల్లో విక్టోరియా ఫాల్స్ ఒకటి. జాంబియా–జింబాబ్వే దేశాల మధ్య ప్రవహించే ప్రఖ్యాత విక్టోరియా ఫాల్స్ అంచున పడుకొని కిందకు చూడటం కనిపించింది. ఆ సమయంలో జలపాతంలోని నీరు ఉద్ధృతంగా కిందకు ప్రవహిస్తోంది. ఎందరో టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న ఈ జలపాతాన్ని స్థానికులు డెవిల్స్ పూల్ గా అభివర్ణిస్తుంటారు. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్ ఈ వీడియోను నెటిజన్లతో పంచుకుంది. ‘380 అడుగుల జలపాతానికి ఇంత దగ్గరగా నిలవడం అనేది మామూలు విషయమే అని తెలుసుకున్నా అంటూ ఆ వీడియో కింద కామెంట్ పోస్ట్ కూడా చేసింది.