Current Date: 06 Oct, 2024

పొగాకు అనర్ధాలకు గల కారణాలపై 31న అవగాహన సదస్సు

ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పొగాకు వాడకం వల్ల వచ్చే అనార్ధాలపై అవగాహన కల్పించే ప్రక్రియను ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లయిన్స్‌ కేన్సర్‌ Ê జనరల్‌ హస్పటల్‌ ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు హాస్పిటల్‌ మేనేజంగ్‌ ట్రస్టీ వి.ఉమామహేశ్వరావు, కార్యక్రమ నిర్వాహకులు జి.ఎస్‌.శివ ప్రకాష్‌ తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటకు సీతమ్మదార నార్త్‌ ఎక్సటెన్షన్‌లోని ఆస్పత్రి ఆవరణలో దూమపానం, మత్తు పదార్ధాలు, మాధక ద్రవ్యములకు అలవాటు అయినవారికి, యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పొగాకు రహిత సమాజంగా రూపొందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పొగాకు అనర్ధాలకు గల కారణాలు, రానున్న ముందు తరాల పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున పొగాకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని పిలుపునిస్తున్నారు.