రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరొకసారి తగ్గించాలని నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరను కిలోకు రూ.160 నుండి రూ.150కి, బియ్యం ధరను రూ.48 నుండి రూ.47కి, స్టీమ్డ్ బియ్యం ధరను రూ.49 నుండి రూ.48కి తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, గురువారం నుండి తగ్గించిన ధరలతో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నిర్ణయంతో సంబంధిత జాయింట్ కలెక్టర్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ నెలలో రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండు సార్లు ధరలను తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పత్రికా ప్రకటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.