టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొంతకాలంగా తన రిలేషన్‌షిప్‌పై వస్తున్న రూమర్లకు ముగింపు పలుకుతూ మోడల్, నటి అయిన సమ్రీన్ కౌర్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సమ్రీన్‌తో ఉన్న ఫొటోలను పంచుకుంటూ ‘మై పర్సన్’ అని క్యాప్షన్ జోడించి తన ప్రేమను బహిర్గతం చేశారు. సమ్రీన్ కౌర్ జమ్మూకశ్మీర్‌కు చెందిన సెలబ్రిటీ. పుణెలో బీకామ్ (ఆనర్స్) పూర్తి చేసిన ఆమె, 'ఫెమినా మిస్ ఇండియా 2018' ఫైనలిస్ట్‌గా గుర్తింపు పొందారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి '83', 'సర్దార్ జీ 2' వంటి చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లో నటించిన సమ్రీన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. టీ20ల్లో భారత ప్రధాన బౌలర్‌గా రాణిస్తూ, వన్డేల్లోనూ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్న అర్ష్‌దీప్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అభిమానులు, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించడమే కాకుండా కొద్ది సమయంలోనే దాదాపు 2 మిలియన్లకు పైగా లైకులు సాధించింది.