Current Date: 27 Nov, 2024

అభిషేక్ బచ్చన్‌తో విడిపోనున్న ఐశ్వర్యరాయ్.. ఇదిగో సాక్ష్యం!

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌పై మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొన్ని నెలల కిందటే ఆమె తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోవడానికి సిద్ధంగా ఉందంటూ ప్రచారం జరిగింది. మరోవైపు బచ్చన్ కుటుంబంలో చీలికలు వచ్చాయనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు ఐశ్వర్య-అభిషేక్ దంపతులు. రీసెంట్‌గా ఐష్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పిన అభిషేక్, ఆమెతో దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు. అక్కడితో ఆగిపోయిన పుకార్లు ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నాయి.  అత్త జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్ కు మధ్య అభిప్రాయబేధాలున్నాయనే పుకార్లు చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. జయా బచ్చన్ ఉన్నచోట ఐశ్వర్య కనిపించడం లేదు. ఈ పుకార్లపై ఈసారి బచ్చన్ కుటుంబం స్పందించకపోవడం గమనార్హం.

Share