యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస హిట్‌లతో దూసుకెళ్తున్నాడు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన లవ్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ. 12.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి గ్రాండ్ ఓపెనింగ్ సాధించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో రెండో రోజు కూడా ఈ సినిమా అదే స్థాయిలో కలెక్షన్ల జోరును కొనసాగించింది. రిలీజైన కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 25.2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టాక్ పాజిటివ్‌గా ఉండటం, వీకెండ్ రేసులో పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడం ఈ చిత్రానికి మరింత కలసివచ్చింది. థియేటర్లలో వస్తున్న స్పందన చూస్తుంటే ఈ వారం వసూళ్లు మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కథలోని లవ్, ఎమోషన్స్‌తో పాటు నటీనటుల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో 'చెన్నై లవ్ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.