Current Date: 08 Feb, 2026

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఇక 20 రోజులే!

స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకకు ముహూర్తం ఖరారైంది. గత ఏడాది అక్టోబరులో వీరి నిశ్చితార్థం జరిగినప్పటి నుండి పెళ్లి ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారగా, ఈ నెల 26న ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీరి వివాహ వేదికగా నిలవనుంది. పెళ్లికి మరో 20 రోజులే సమయం ఉండటంతో ఇరు కుటుంబాల్లో సందడి నెలకొంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో రాజస్థాన్‌లో వివాహం జరగనుండగా, హైదరాబాద్‌లో భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 4వ తేదీన సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఈ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెండు కుటుంబాల వారు పెళ్లి పనులను వేగవంతం చేస్తూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, ప్రస్తుతం 'రణబాలి' చిత్రంతో ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. వివాహం తర్వాత ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. వ్యక్తిగత జీవితంలో ఒక్కటవుతున్న ఈ స్టార్ కపుల్, ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ ఈ క్రేజీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు.