డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శాంసన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో కేవలం 47 బంతుల్లోనే తన రెండో అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సంజూ 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా టీమ్ 147 పరుగులకే ఆలౌటైంది. దీంతో నాలుగు టీ20ల సిరీస్‌లో1-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది.
Share