Current Date: 05 Oct, 2024

భువనేశ్వరి కోసం 2 చీరలు కొన్న చంద్రబాబు ధర ఎంతంటే?

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరికి స్పెషల్ గిఫ్ట్ తీసుకున్నారు. విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబురెండు చీరలు కొనుగోలు చేశారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను చూసి బాగున్నాయని కితాబిచ్చిన చంద్రబాబు..ఎక్కడివి? అని ఆరా తీశారు. ఉప్పాడ హ్యాండ్లూమ్‌ సొసైటీలో తయారైనవని అక్కడున్న నేత కార్మికుడు మల్లెల నాగేంద్రబాబు తెలిపారు. వెంటనే ధర అడిగిన చంద్రబాబు  డబ్బులు ఇచ్చి ఆ చీరలను ప్యాక్ చేయమని చెప్పారు. వాటి ధర ఒక్కొక్కటి రూ.2,000గా ఉంది.తన జీవితంలో ఎప్పుడూ చీరలు కొనలేదని ఇప్పుడు మన చేనేత కళాకారులు తయారు చేసిన చీరలు చూడగానే ఆకట్టుకున్నాయని తెలిపారు. అందుకే తన సతీమణికి రెండు చీరలు కొనుగోలు చేశానన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని.. నెలలో ఒక్క రోజైనా చేనేత వస్త్రాన్ని తప్పక ధరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Share