ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, సమీప స్థావరాలపై పలు పేలుళ్లు జరిగినట్లు అక్కడి మీడియా వార్తలు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది అక్టోబరు 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎదురుదాడులతో విరుచుకుపడుతోంది. అక్టోబరు 1న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై పెద్దఎత్తున మిసైల్స్‌తో మెరుపుదాడికి దిగింగి. దాదాపు 200 మిసైల్స్‌ను ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ప్రయోగియోగించింది. ఆరు నెలల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ రెండోసారి ప్రత్యక్ష దాడికి దిగింది. లెబనాన్‌లో హెజ్బొల్లా గ్రూప్ చెందిన కీలక నేతను ఇజ్రాయెల్ అంతం చేయటంతో ఇరాన్.. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసింది.
Share