ఆగస్టు 16లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని గ్యాస్ కంపెనీలు మరోసారి స్పష్టం చేశాయి. లేదంటే గ్యాస్ కనెక్షన్, సబ్సిడీ నిలిచిపోతుందని కస్టమర్లను హెచ్చరించాయి. ఇప్పటికే పూర్తి చేసిన వారు మళ్లీ ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదని తెలిపాయి. గ్యాస్ ఏజెన్సీ లేదా డెలివరీ బాయ్ లేదా ఆన్లైన్లో సులభంగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని వివరించారు.