Current Date: 05 Oct, 2024

ఢిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్ 1600 మందిపై కేసు

ఏప్రిల్-జూన్ మధ్య ఢిల్లీ మెట్రో రైలులో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన దాదాపు 1600 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడు శాతం అధికమని పేర్కొంది. రైలులో తినడం, కింద కూర్చుని న్యూసెన్స్ చేయడం వంటి నేరాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. మెట్రో రైల్వేల చట్టం ప్రకారం 1,647 మందిపై కేసులు నమోదైనట్టు వివరించింది. మెట్రో రైలు పరిసరాల్లో మున్ముందు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. మెట్రోల్లో రోజూ 67 లక్షల మంది   ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి వాటిపై పర్యవేక్షణ కష్టమవుతుందని పేర్కొన్నారు. మెట్రో ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారానే తెలుసుకుంటున్నట్టు చెప్పారు.

Share