Current Date: 08 Aug, 2026

ఆగస్టు 15 వేడుకలకు అమరావతి రెడీ

 ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలకు రాజధాని అమరావతి సిద్ధమవుతోంది. రాయపూడిలో 30 ఎకరాల విస్తీర్ణంలో పనులు జరుగుతున్నాయి. ఎంత వర్షం వచ్చినా తట్టుకొనేలా 15వేల టన్నుల గ్రావెల్తో చదును చేస్తున్నారు. అలాగే వాటర్ ప్రూఫ్ షీట్లను తీసుకొస్తున్నారు. 10 ఎకరాల్లో గ్యాలరీలు, 10 ఎకరాల్లో పార్కింగ్, మరో 10 ఎకరాల్లో రక్షక దళాల పరేడ్కు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం బలగాల రిహార్సల్స్ జరుగుతున్నాయి.