కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కిందని సంతోషిస్తున్నవేళ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానికి నిధుల కేటాయింపుపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సందిగ్ధంలో పడేశాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపులపై వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తగిన ప్రాధాన్యత దక్కడంపై విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఏపీ రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్ల కేటాయింపు, పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తాననడం, రాష్ట్రంలో పరిశ్రమలో ఏర్పాటుకు సహకారం, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల వెనుకబాటుతనం దూరం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బడ్జెట్ లో ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సందిగ్దగంలో పడేశాయి. ఏపీ రాజదాని అభివృద్ధికి కేటాయించిన 15 వేల కోట్లు గ్రాంట్ కాదని, ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చి ఇచ్చే రుణమని ఆమె స్పష్టం చేశారు.
Share