Current Date: 08 Feb, 2026

రాజాసాబ్‌లో ప్రభాస్ చిన్న కోరిక.. రూ.11 కోట్లు నష్టం!

సినిమాల్లో పాత వింటేజ్ పాటలను రీమిక్స్ చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌గా మారింది. ప్రభాస్ నటించిన  'ది రాజా సాబ్' చిత్రంలోనూ ఒకప్పటి సూపర్ హిట్ హిందీ పాటను రీమిక్స్ చేశారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో 1982 నాటి 'డిస్కో డ్యాన్సర్' సినిమాలోని "కోయీ యహా.. అహా.. నాచో నాచో..." అనే హిందీ పాటను ఎంపిక చేసి, దానిని రీమిక్స్ చేశారు. కానీ మూవీ ప్లాప్ అవ్వడంతో.. ఆ పాట కూడా ఒక కూడా జనానికి చేరువ కాలేదు. సాధారణంగా పాత పాటల రీమిక్స్ హక్కులు కొన్ని లక్షల్లో ఉంటాయి. కానీ ఈ పాట కోసం నిర్మాత ఏకంగా 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఒక పాట హక్కుల కోసమే ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. థమన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ కంటే ఇది ఎక్కువేనని, ప్రభాస్ అభిరుచి మేరకు నిర్మాతలు ఏమాత్రం వెనుకాడకుండా ఈ డీల్ ఓకే చేసినట్లు తెలుస్తోంది.