Current Date: 05 Oct, 2024

ఒలింపిక్స్ షురూ భారత్ నుంచి 117 మంది రేసులో

పారిస్ వేదికగా ఒలింపిక్ ప్రారంభం అయ్యాయి. గురువారం ఒలింపిక్ క్రీడలు మొదలు కాగా.. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో ఒలింపిక్స్ వేడుకల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. పారిస్ ఒలింపిక్ గేమ్స్ జులై 25 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈసారి మొత్తం 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లు జరగనుండగా 206 దేశాల నుంచి 10 వేల మందికిపైగా అథ్లెట్లు పాల్గొననున్నారు. ఈసారి అత్యధికంగా 21 మంది భారత షూటర్లు పోటీలో ఉన్నారు. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఈసారి ఒలింపిక్స్‌ బరిలో దిగుతున్నారు. అయితే ఇందులో 72 మంది భారత అథ్లెట్లు తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగుతుండటం గమనార్హం. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా 121 మంది అథ్లెట్లు పోటీ పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో 2024 ఒలింపిక్ గేమ్స్ నిలవనుంది. పారిస్ ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించ లేకపోయినప్పటికీ ఈసారి 117 మంది భారత అథ్లెట్లు పోటీలో ఉండటం గమనార్హం.

Share