Current Date: 05 Aug, 2026

108లోనే పాము విషానికి విరుగుడు

పాము కాట్లకు గురై ఆస్పత్రికి వెళ్లేలోపే సమయం మించిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా 108 అంబులెన్సులలోనే స్నేక్ యాంటీ వీనం(పాము విషానికి విరుగుడు)ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కాల్ చేయగానే అంబులెన్స్ వస్తుంది. బాధితుడి లక్షణాలను సిబ్బంది ఫోన్‌లోనే వైద్యులకు వివరిస్తారు. వారి సూచనతో యాంటీ వీనం ఇచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తారు