తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ఇస్తానన్న రూ. 100 కోట్ల ఫండ్ తీసుకోవటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత నాలుగైదు రోజులుగా అదానీ వ్యవహారంపై తీవ్ర చర్చ జరగుతోందని.. అదానీ నుంచి రూ. 100 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు.కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ. 100 కోట్లు ఇస్తానని లేఖ రాసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఆ డబ్బులు తీసుకోవటానికి సిద్ధంగా లేమని చెప్పారు. ఈ మేరకు అదానీ గ్రూప్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్ పలు విషయాలను వెల్లడించారు.'అదానీ వ్యవహారానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అదానీ నుంచి రూ. 100 కోట్లు నిధులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అదానీ నుంచి డబ్బులు తీసుకున్న మీరు వారి తప్పులను ఏ విధంగా ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీని అడిగారు. చాలా సందర్భాల్లో దీనిపై వివరణ ఇచ్చాం.
Share