Current Date: 26 Nov, 2024

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు శ్రీకాకుళం కుర్రాడు..

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన త్రిపురాన విజ‌య్‌ను ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్రాంచైజీ రూ. 30 ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. ఇలా ఐపీఎల్‌లో చోటు ద‌క్కించుకోవ‌డంపై విజ‌య్‌కు కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా విజ‌య్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఐపీఎల్‌కు ఎంపికయిన త్రిపురాన విజ‌య్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ కొత్త అధ్యాయంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం గర్వపడేలా కష్టపడండి" అని రామ్మోహ‌న్ నాయుడు ట్వీట్ చేశారు.

Share