Current Date: 26 Nov, 2024

నిషేధాన్ని ధిక్కరించి బాణసంచా కాల్చిన ఢిల్లీ వాసులు

దేశ రాజధాని ఢిల్లీ నేడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్ర వేసుకుంది. దీపావళి సందర్భంగా గత రాత్రి ఢిల్లీ వ్యాప్తంగా పేలిన బాణసంచాతో ఢిల్లీలో కాలుష్యం భయంకరంగా పెరిగిపోయింది. బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ ఎవ్వరూ లెక్క చేయలేదు. ఫలితంగా ఢిల్లీపై కాలుష్యం దుప్పటిలా పరుచుకుంది. దీంతో ఈ ఉదయం ఆరు గంటల సమయానికి ఢిల్లీలో గాలి నాణ్యత ఇండెక్స్ రికార్డు స్థాయిలో 359 దాటేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలతోపాటు ఈస్ట్, వెస్ట్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు బాణసంచా కాల్చి పండుగ జరుపుకొన్నారు. రాత్రి ఒంటి గంట తర్వాత గాలిలో నాణ్యత క్రమంగా తగ్గిపోయింది.  ఢిల్లీ వాసులు నిషేధాన్ని పక్కనపెట్టి బాణసంచా కాల్చడంతో అనేక ప్రాంతాల్లో 2.5గా ఉన్న స్థాయులు ఆ తర్వాత క్యూబిక్ మీటర్‌కు 900 మైక్రోగ్రాములు వరకు పెరిగింది.

Share