బెంగుళూరు రేవ్ పార్టీ ఇష్యూ టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. బెంగుళూరు రేవ్ పార్టీలో సినీ నటి హేమతో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తుండగా.. సందెట్లో సడేమియా అన్నట్టుగా ఈ రేవ్ పార్టీకి రాజకీయరంగు పులుమేస్తున్నారు.
రేవ్ పార్టీ వ్యవహారం వెలుగులోకి రావడంతో.. జానీ మాస్టర్ ఆ రేవ్ పార్టీలో దొరికాడంటూ కొన్ని పోస్ట్‌లు దర్శనం ఇవ్వగా.. వాటిని ఖండిచారు జానీ మాస్టర్. తాజాగా యాంకర్ శ్యామల సైతం ఆ రేవ్ పార్టీలో ఉందంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేయడంతో వాటిని ఖండించింది యాంకర్ శ్యామల.
ఏపీ ఎన్నికల నేపథ్యంలో యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ తరుఫున ప్రచారం చేయడంతో ఈ ఇష్యూలోకి లాగుతూ.. తప్పుడు కథనాలను ప్రసారం చేసి.. వారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. దాంతో.. తనపై దుష్ప్రచారం చేస్తున్న టీవీ ఛానల్‌పై పరువునష్టం దావా వేసింది యాంకర్ శ్యామల. జర్నలిజం పేరుతో కొంతమంది దిగజారిపోతున్నారని.. తనకి సంబంధం లేని విషయాల్లోకి లాగుతున్నారంటూ.. వారికి బుద్ది చెప్తానంటూ వీడియో విడుదల చేసింది