హైదరాబాద్‌లోని ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా బుల్‌డోజర్లు ఇప్పుడు పరిగెట్టిస్తోంది. స్వయంగా ఆక్రమణలు కూలగొట్టి ఆ ఫొటోలను అధికారులకు పంపుతున్నారు. తాజాగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో 80 వరకు అక్రమ నిర్మాణాలున్నట్లు హైడ్రా గుర్తించింది. ఉస్మాన్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌లో ఉన్న పలు విల్లాలు, ఇతర నిర్మాణాలను అధికారులు ఇప్పటికే కూల్చివేశారు. తాజా సర్వేలో హిమాయత్‌సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో పది పైనే భారీ నిర్మాణాలున్నట్లు తేలింది. హిమాయత్‌సాగర్‌లో సర్వే చేస్తున్న సందర్భంలోనే చాలామంది రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన ఓ నేతదిగా ప్రచారం జరుగుతున్న ఫామ్‌హౌస్‌కు చెందిన ప్రహరీ, వాచ్‌మెన్ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం ఆయన దృష్టికి వెళ్లడంతో కూల్చివేతకు ఆదేశించారు. మరో వ్యాపారవేత్త ఫామ్‌హౌస్ ప్రహరీ హిమాయత్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు తేలడంతో ఆయన కూడా కూల్చివేతకు ముందుకొచ్చారు.
Share