ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆ మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్‌ను తిడుతున్నఆడియో ఒకటి లీక్ అయింది. భీమ్లా నాయక్ ఈవెంట్‌కు తనను అడ్డుకుంటున్నారని త్రివిక్రమ్ అదంతా చేస్తున్నాడని బండ్ల గణేష్ ఓ అభిమానితో తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఇష్టమొచ్చినట్లు తిట్టేశాడు. ఇండస్ట్రీలో ధుమారం రేగడంతో వాయిస్ తనది కాదని బుకాయించాడు. ఆ తరువాత ఓ టైంలో నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ వాయిస్ నాదే, ఆడియో నాదే.. కోపంలో అన్నాను అంటూ చెప్పేశాడు. తాజాగా గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో మాట్లాడుతూ త్రివిక్రమ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. ఎవరో అభిమాని ఫోన్ చేశాడు.. ఏదో మూడ్‌లో ఉండి అలా అన్నాను. త్రివిక్రమ్‌కు సారీ అంటూ నాటి ఆడియో లీక్ ఘటన గురించి వివరణ ఇచ్చుకున్నాడు. అదే వేదిక మీద మాట్లాడుతూ తమకు ఓ ఛాన్స్ ఇవ్వమని చిరంజీవిని రిక్వెస్ట్ చేశాడు బండ్లగణేష్.