Current Date: 04 Oct, 2024

ఢిల్లీ బ్యాటర్ ఒకే ఓవర్‌లో 6,6,6,6,6,6.. ఇక ఐపీఎల్‌లో కనక వర్షమే

ఢిల్లీ ప్రీమియర్‌ టీ20 లీగ్‌లో సంచలన రికార్డ్ నమోదైంది. సౌత్‌ ఢిల్లీకి చెందిన బ్యాటర్‌ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్యా.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మసన్ భరద్వాజ్‌ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. బౌలర్‌ చేయి నుంచి బంతి విడవడమే ఆలస్యం గ్రౌండ్ వెలుపలికి పంపించడమే అన్నట్లుగా హిట్టింగ్ చేశాడు. క్లీన్‌ స్ట్రైకింగ్‌తో ఒకే ఓవర్‌లో 36 రన్స్ చేసి సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. మ్యాచ్‌లో 50 బంతుల్లోనే 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 రన్స్ చేశాడు. మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్‌స్టార్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 రన్స్‌ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే పరిమితమైంది. ఐపీఎల్‌ 2025 సీజన్ మెగా వేలం త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్‌ ప్రియాన్ష్‌ ఆర్యాకి ఎక్కువ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.

Share