Current Date: 28 Sep, 2024

విశాఖ ఉక్కుని సెయిల్‌లో విలీనం? సంకేతాలిచ్చిన ఉక్కు మంత్రి

విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రం అడుగులు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రైవేటీకరణపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండటంతో తన కొత్త ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)లో విశాఖ ఉక్కు (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌)ను విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తను లీక్ చేసింది.ప్రైవేటీకరణను అడ్డుకుంటూ  1,325 రోజులుగా కార్మికులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. దాంతో కేంద్రం కూడా కాస్త వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ‘విలీన ప్రతిపాదనపై స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎండీసీతో చర్చలు జరుగుతున్నాయి. విలీనానికి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నా.. పరిష్కారం ఆలోచిస్తున్నాం’ అని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాజాగా తెలిపారు.సెయిల్‌కు సంబంధించి ఒక మిలియన్‌ ఉక్కు ఉత్పత్తి అదనంగా చేయాలంటే ఏడేళ్ల సమయం పడుతుంది. .

Share