Current Date: 28 Sep, 2024

పోలీసుల విచారణలో డైరెక్టర్ సుకుమార్‌ని ఇరికించిన జానీ మాస్టర్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రోజురోజుకు ట్విస్టులు తిరుగుతోంది. ఇటీవల మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్, విశ్వక్ సేన్ పేర్లు ఇప్పటికే తెరపైకి.. తాజాగా దర్శకుడు సుకుమార్ పేరు ప్రస్తావనకొచ్చింది. పోలీసు విచారణలో జానీ మాస్టర్ సుకుమార్ పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది.అమ్మాయితో ఇష్యూకు సంబంధించి దర్శకుడు సుకుమార్ దగ్గర తను పంచాయితీ పెట్టానని పోలీసులకు జానీ మాస్టర్ వెల్లడించాడు. ఆమె వేధింపులు భరించలేక, విషయాన్ని సుకుమార్  చెంతకి తీసుకెళ్లానని, ఆయన బాధితురాలితో మాట్లాడాడని, అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని ఆరోపించాడు జానీ మాస్టర్.ఈ కేసుకు సంబంధించి పోలీసులు త్వరలోనే సుకుమార్‌ను కూడా విచారిస్తారనే ప్రచారం సాగుతోంది. బాధితురాలు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతుండగా.. పెళ్లి చేసుకోవాలంటూ బాధితురాలు తరచుగా తనను వేధించేదని, కొన్నిసార్లు బెదిరింపులకు కూడా పాల్పడిందని జానీ మాస్టర్ ఆరోపించడం గమనార్హం. 

Share