Current Date: 26 Nov, 2024

విశాఖ ఉక్కు రక్షణకై అక్టోబర్‌ 2న నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయండి

విశాఖ ఉక్కు రక్షణకై ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ  అక్టోబర్‌ 2న నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వి.వి.రమణమూర్తి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ద్వారకా నగర్‌లోని ఓ హోటల్‌లో  విశాఖ సిటిజన్‌ ఫోరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర ప్రజలపై ఉందన్నారు.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. దీనిని కూటమి ప్రభుత్వ పాలకులు వ్యతిరేకించకుండా తలాడిస్తున్నారని మండిపడ్డారు. స్టీల్‌ ప్లాంట్‌ పోరాటంతో సాధించుకున్నామని, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు విశాఖ ఉక్కును జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేపడుతున్న ప్రజా ఉద్యమ ర్యాలీ అక్టోబర్‌ 2న డాబాగార్డెన్స్‌ అంబేద్కర్‌ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీగా నిర్వహిస్తున్నామన్నారు. 

Share