Current Date: 25 Nov, 2024

ఏపీలో వాలంటీర్ వ్యవస్థకి చెక్.. అసెంబ్లీలో మంత్రి క్లారిటీ

ఏపీలో వాలంటీర్ వ్యవస్థకి కూటమి ప్రభుత్వం పూర్తిగా చెక్ చెప్పేసింది. ఈ మేరకు శాస‌న మండ‌లిలో  ఏపీ సాంఘిక సంక్షేమ‌శాఖ మంత్రి బ‌లావీరాంజ‌నేయులు క్లారిటీగా చెప్పేశారు. తాము అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌కు ఇప్పుడిస్తున్న గౌర‌వ వేత‌నం రూ.5 వేలు కాదు, రెట్టింపు చేసి రూ.10 వేలు ఇస్తామ‌ని ఉగాది ప‌ర్వ‌దినం నాడు చంద్ర‌బాబు ప్రకటించారు. కానీ.. శాస‌న మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై వైసీపీ స‌భ్యులు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఆ ప్రశ్నకి మంత్రి బ‌లావీరాంజ‌నేయులు సమాధానం చెప్తూ “ఔను, మేము వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌ని హామీ ఇచ్చిన మాట నిజ‌మే. అందుకు సంబంధించిన జీవో గ‌త ప్ర‌భుత్వం ఇవ్వ‌లేదు. లేని వ్య‌వ‌స్థ‌ను మేము ఎలా కొన‌సాగిస్తాం? లేని పిల్లోడికి ఎలా పేరు పెడ‌తారు?” అంటూ క్లారిటీగా వాలంటీర్ ఇప్పటికే లేదు.. ఇకపై ఉండబోదు అని క్లారిటీగా చెప్పేశారు.

Share