Current Date: 15 Nov, 2024

అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య, శోభిత పెళ్లి.. తేదీ కూడా ఫిక్స్

అక్కినేని హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చేనెల డిసెంబర్ 4న వీరి పెళ్లి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే గ్రాండ్‌గా జరగనుంది. అక్కినేని కుటుంబానికి ఈ స్టూడియో సెంటిమెంట్‌ కావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగువారి సినీదిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం కూడా అక్కడే ఉంది. అందువల్లే పెళ్లి వేడుక అక్కడే నిర్వహిస్తే తాతయ్య ఆశీర్వాదాలు కూడా ఉంటాయని అక్కినేని కుటుంబసభ్యులు భావిస్తున్నారట. పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ప్రత్యేకంగా వేదికను తయారు చేస్తున్నట్లు టాక్. తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడేలా వీరి వివాహా వేదికను అలంకరించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Share