ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడనే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పటికీ మిగిలి ఉంది. ఐపీఎల్ 2025లోనూ ధోనీ ఆడనున్నాడు. అందుకోసం.. అతనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా సీఎస్కే ఫ్రాంఛైజీ
రూ.4 కోట్లకి రిటెన్ చేసుకుంది. ధోనీ ఈ ఐపీఎల్‌కు ఎప్పుడు గుడ్ బై చెబుతాడో అన్న విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ బట్టబయలు చేశాడు. టీమ్ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడుతో యూట్యూబ్ ఛానెల్‌తో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ జట్టు గురించి, ధోనీ రిటైర్మెంట్ గురించి మాట్లాడారు. ‘మహి ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పడు.. తన వద్దే ఉంచుకుంటాడని మీకు తెలుసు. ఇలాంటి విషయాలు చివరి క్షణంలో బయటకు వస్తాయి. ధోనీ సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని మేము ఆశిస్తున్నాము. అతని కోసం సీఎస్కే తలుపులు తెరిచే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఆయన కమిట్‌మెంట్, డెడికేషన్ వల్ల ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకుంటాడు’ అని విశ్వనాథన్ అన్నాడు.
Share