ఏపీ శాసనసభకు ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో నాన్`కేడర్ ఐఏఎస్‌లకు ఐఏఎస్ కన్ఫర్మేషన్‌ను వాయిదా వేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) స్పందించింది. ఈ మేరకు నాన్`కేడర్ ఐఏఎస్‌లను ఎంపిక చేసేందుకు జూన్ 6న నిర్వహించనున్న ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ ప్రక్రియను జూన్ 25కి వాయిదా వేసింది. యూపీఎస్సీ నిర్ణయంతో సీఎస్, అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.