Current Date: 24 Sep, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం రిలే నిరాహార దీక్ష శిబిరం నుంచి

విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర సహకారం ఉంటుంది. ఎంపీ భరత్ కానీ కార్మికులు కష్టపడి ఉత్పత్తిని అందించాలి. మరో రెండు వారాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని విశాఖ ఎంపీ భరత్ అన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ కూర్మాన్నపాలెంలో చేస్తున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన శిభిరంకి ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు పాల్గొని కార్మికులతో మాట్లాడారు.స్టీల్ ప్లాంట్ సమస్యలపై ఢీల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని,  కేంద్ర ఉక్కు మంత్రి స్టీల్ ప్లాంట్ పై సానుకూలంగా ఉన్నారని , స్టీల్ ప్లాంట్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని మరో పది రోజులలో స్టీల్ ప్లాంట్ కు సహకారం అందుతుందని చెప్పారు.పల్లా  స్టీల్ ప్లాంట్ సమస్య తన సమస్యఅని, ముఖ్యమంత్రి నేరుగా డిల్లీలో సమస్య పరిష్కారం కోసం చర్చిస్తున్నారని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారాం స్టీల్ ప్లాంట్ కు తప్పకుండా కేంద్రం నుండి సహకారం వుంటుందని  అన్నారన్నారు. ఐతే కేంద్రం నుండి ఉక్కు కార్మికులు కష్టించి ప్లాంట్ ను లాభాల బాటలో తీసుకొని వెళ్ళాలని కోరారు. 

Share