Current Date: 26 Nov, 2024

అమ్మగారితో ఎంపీ ఫొటో షూట్‌

విశాఖ ఉక్కు సమస్యల పరిష్కారం కోసం  కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసినట్టు విశాఖ ఎంపీ శ్రీభరత్‌ ప్రకటన విడుదల చేయడం చూసి జనం నవ్వుకుంటున్నారు. సమస్య కేంద్ర ఉక్కు, గనుల శాఖ దగ్గర ఉంటే శ్రీభరత్‌ ఆర్థిక మంత్రి కి విజ్ఞాపణ ఎందుకు చేశారో మరి ఈ ఎంపీకే తెలియాలి. పైగా ఒక్కరే వెళ్లి ఆమెతో ఫొటో దిగి పత్రికలకు విడుదల చేసేసి ఇక తన బాధ్యత తీరిపోయిందని అనుకున్నట్టుంది. శ్రీభరత్‌కు నిజంగా విశాఖ ఉక్కు పై చిత్తశుద్ధి ఉంటే  ఉత్తరాంధ్రలోని మిగిలిన ఎంపీలను, అవసరమైతే ఈ ప్రాంత శాసనసభ్యులను, యూనియన్‌ నాయకుల్ని తీసుకెళ్లి అమిత్‌ షా తోనే, ప్రధాని మోడీతోనే మాట్లాడిరచాలి. కానీ ప్రజలను మభ్యపెట్టే విధంగా నిర్మలా సీతారామాన్‌కు విజ్ఞాపణ ఇచ్చాననడం పబ్లిసిటీ కోసమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌లో విశాఖ ఉక్కుకు రూపాయి కూడా కేటాయించని నిర్మలను ఎప్పుడూ ఈ ఎంపీ శ్రీభరత్‌ ప్రశ్నించలేదు. ఇప్పుడు ఆమె ఏ విధంగా సహాయం చేయగలరని అనుకున్నారో ఆయనకే తెలియాలి. అందుకే ఇది కేవలం ఆర్థికమంత్రితో ఫొటో షూట్‌ మాత్రమే అవుతుందని కార్మిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉక్కు సమస్య పరిష్కార మార్గం ఇది కాదని కార్మికులు భావిస్తున్నారు.

Share