Current Date: 24 Sep, 2024

విశాఖలో నూనె వ్యాపారుల దందా!

విశాఖలో నూనె వ్యాపారులు దందా మొదలెట్టేశారు. నూనెల దిగుమతులపై 20శాతం సుంకం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. అసలే వినాయక చవితి సంబరాల్లో భాగంగా చాలా చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వినియోగదారులకు జెల్ల కొట్టేలా శనివారం తెల్లవారుజాము నుంచే వ్యాపారులు 30శాతం ధరలు పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. కానీ కేంద్రం పేరు చెప్పి వ్యాపారులు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోట్లాది రూపాయల నూనె స్టాక్‌ను బ్లాక్‌ చేసేశారు. ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ వద్ద ఉన్న స్టాకుకు ధరల రెక్కలు తొడిగేశారు. 15కేజీల నూనె డబ్బా నిన్నటి వరకు రూ.1600వరకు పలికేది. ఇప్పుడు ఆ డబ్బాను రూ.1900, రూ.2వేల వరకు అమ్ముకుంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బందులుంటాయంటూ పెద్ద డీలర్లు,  చిన్న డీలర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నూనె ప్యాకెట్ల ధరల్నీ పెంచేస్తున్నారు.

Share