Current Date: 26 Nov, 2024

ప్రధాని మోడీకి కాలితో సంతకం చేసిన జెర్సీని బహూకరించిన అథ్లెట్

పారిస్‌ పారాలింపిక్స్‌-2024లో భారత్‌ అత్యధికంగా 29 పతకాలు గెలిచింది. ఇందులో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, పదమూడు కాంస్య పతకాలు ఉన్నాయి. దాంతో అథ్లెట్స్‌ను పిలిపించి మరీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.ప్రతి ఒక్కరితో విడివిడిగా కలుసుకొని ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా శారీరక ఎదుగుదల లోపం ఉన్న జావెలిన్‌ త్రోయర్‌ నవ్‌దీప్‌ సింగ్‌తో మోదీ అహ్లాదంగా గడిపారు. మరుగుజ్జు క్రీడాకారుడైన అతని చేతుల మీదుగా టోపీ ధరించేందుకు నేలపై కూర్చున్నారు. దీంతో నవ్‌దీప్‌ అమితానందంతో ప్రధానికి టోపీ తొడిగాడు. అనంతరం తన చేతి భుజంపై ఆటోగ్రాఫ్‌ కోరగా  ప్రధాని వెంటనే పెన్‌ తీసుకొని అతని ముచ్చట తీర్చారు. జావెలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించిన అతని గురించి అడిగి తెలుసుకున్నారు.షూటర్‌ అవని లేఖరా, జూడో ప్లేయర్‌ కపిల్‌ పర్మార్, ఆర్చర్లు శీతల్‌ దేవి, రాకేశ్‌ కుమార్‌ తదితరులు ప్రధానితో ముచ్చటించారు. ఈ సందర్భంగా శీతల్‌ కాలితో సంతకం చేసిన జెర్సీని మోదీకి బహూకరించింది. మోడీ సంతోషంగా తీసుకున్నారు

Share