Current Date: 25 Sep, 2024

సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం క్లిక్ అవుతుందా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరక్క యాచించటమే తమ వృత్తి అన్నట్టుగా మారిపోయిన ట్రాన్స్ జెండర్లకు ఓ మార్గం చూపే దిశగా ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్‌లను వాలంటీర్స్‌గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.హోంగార్డ్స్ తరహాలో ట్రాన్స్ జెండర్లకు కూడా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రహదారులు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధితో పాటు పారిశుద్ధ్యం, ఇతర పనుల్లోని పురోగతిపై సమీక్షించే సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.వాస్తవానికి ప్రస్తుతం ట్రాన్స్ జెండర్లు కూడా చదువుకుంటూ రకరకాల ఉద్యోగాలు చేస్తూ గౌరవంగా జీవిస్తున్నారు. కానీ చాలా మంది ఇప్పటికీ దుకాణాలలో, జంక్షన్ల దగ్గర, రైళ్లు, బస్సుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ.. బిక్షాటన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

Share