ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకూ సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు. ఢిల్లీ లోని ఆప్ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని అన్నారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతామన్నారు. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని.. త్వరలోనే వారు బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహాడ్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.
Share