జిల్లాలో మరో సీనియర్ నాయకుడు, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా కేబినెట్‌లో చోటు దొరకలేదు. తొలినుంచీ పార్టీ నాయకత్వం గంటాను చీపురుపల్లిలో పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. విజయనగరం జిల్లా టీడీపీని గంటా చేతుల్లో పెట్టడానికి కూడా అధిష్టానం వెనుకాడలేదు. చీపురుపల్లి నుంచి పోటీచేసి గెలిచి వస్తే మంత్రి పదవిని ఇస్తామని కూడా అధిష్టానం గంటాకు గట్టిగా చెప్పింది. అయినా గంటా ముందుకు రాలేకపోయారు. భీమిలిని విడిచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఈ కారణంగానే గంటాకు మంత్రి వర్గంలో స్థానం దొరకలేదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే తన వియంకుడు నారాయణకు మంత్రి ఇవ్వడం వల్ల కూడా గంటాకు చోటు లేకుండా పోయింది.