మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ మధ్య ఎంత మంచి అనుబంధం ఉందొ అందరికి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ కి మామయ్య అంటే చాలా ఇష్టం. ఎన్నో సందర్భాల్లో వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఈ మేనమామ – మేనల్లుడు కలిసి ఫ్యాన్స్ కి కనువిందు చేసారు. సాయి ధరమ్ తేజ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ అయి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మేనమామ, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ని ఈ సందర్భంగా అభిమానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నటన పట్ల ఎంతో తపనతో ఎదుగుతూ వస్తున్నాడు సాయి తేజ్. నటుడిగా తొలి అడుగులు వేసినప్పటి నుంచీ సహ నటులు, సాంకేతిక నిపుణులపట్ల ఎంత గౌరవమర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. తను ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు కూడా ఎంతో ఆత్మ విశ్వాసం చూపించాడు. తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఆలోచనతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చైతన్యపరుస్తున్నాడు.