సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం పెద చీపురు వలస వద్ద వెలసిన పారమ్మ కొండపై తల్లి 400 సంవత్సరాల క్రితం వెలసియున్నది. ఆ పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం నలుగురు దంపతులచే ఘనంగా నిర్వహించారు. ప్రతి శివరాత్రికి లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. 25 సంవత్సరముల నుండి ప్రతి సంవత్సరము పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కడురమ్యంగా నిర్వహిస్తున్నారు. కూనిశెట్టి బీమారావు దంపతులు, కొల్ల అజయ్ దంపతులు, ఎడ్ల సూరిబాబు దంపతులు, బోను సత్యనారాయణ దంపతులు ఈ కళ్యాణం నిర్వహించారు. కార్తీక మాసం 19 తేదీ నుండి గిరిజన గ్రామాలైన 20 గ్రామాలలో పార్వతి పరమేశ్వరుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకు వెళ్తూ పూజలు నిర్వహించారు. అనంతరం పార్వతి పరమేశ్వరి విగ్రహాలు నాలుగింటిని పారమ్మ కొండపైకి తీసుకొని వచ్చారు.