Current Date: 26 Nov, 2024

డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌తో డీజీపీ భేటీ

రాష్ట్రంలో పోలీసు శాఖ తీరుపై ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్నే రేపాయి. పవన్ వ్యాఖ్యలపై నాడు హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశాల్లో వివరణ కూడా ఇచ్చారు. అయితే శనివారం స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.  పలు కీలక విషయాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, సోషల్ మీడియాలో పోస్టులు, అరెస్టులపై పవన్ తో డీజీపీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Share