Current Date: 28 Nov, 2024

వైయస్ జగన్ ఇంటిని కూల్చిన అధికారికి ప్రమోషన్!

హైదరాబాద్‌‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ నివాసం ముందు ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేసిన అధికారికి ప్రమోషన్ లభించింది. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి కాటా సంబంధిత అధికారి అయిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌పై  తొలుత చర్యలు తీసుకున్నారు. హేమంత్ బోర్కడేను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారుకట్ చేస్తే.. రోజుల వ్యవధిలో ఆ అధికారికి ప్రమోషన్ వచ్చింది. హేమంత్ బోర్కడేకు.. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. లోటస్ పాండ్‌లోని వైఎస్ జగన్ నివాసం ముందున్న ఫుట్‍పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్‌ల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల ఆధ్వరంలో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను పూర్తిగా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.అయితే.. ఈ కూల్చివేతపై ఉన్నతాధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదన్న ఆగ్రహంతో.. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే‌పై ఆమ్రపాలి చర్యలకు ఉపక్రమించారు. 

 

Share