Current Date: 24 Sep, 2024

కోహ్లీ సిక్సర్ దెబ్బకి గోడ బద్దలు బంగ్లాదేశ్‌ బౌలర్లకి హెచ్చరిక

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ముంగిట చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో టీమిండియా ట్రైనింగ్‌ క్యాంప్‌ జరుగుతోంది. ప్రాక్టీస్‌లో విరాట్‌ కోహ్లీ అందరికంటే చాలా ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అశ్విన్‌ను ఎదుర్కోవడంతో ప్రాక్టీస్‌ను మొదలుపెట్టిన విరాట్‌.. ఆల్టర్నేట్‌ పద్దతిలో స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ప్రాక్టీస్‌ చేసే క్రమంలో విరాట్‌ ఓ బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు.విరాట్‌ సిక్సర్‌ దెబ్బకు డ్రెస్సింగ్‌ రూమ్‌ ఓ  గోడకి కన్నం పడింది. గోడ బద్దలైన ఫోటోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. విరాట్‌ ఇదే జోరును కొనసాగిస్తే  తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌కు తిప్పలు తప్పవని అభిమానులు అంటున్నారు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ చెన్నై వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. రెండో టెస్ట్‌ కాన్పూర్‌ వేదికగా సెప్టెంబర్‌ 27న మొదలవుతుంది. అనంతరం మూడు టీ20లు గ్వాలియర్‌, ఢిల్లీ, హైదరాబాద్‌ వేదికలుగా అక్టోబర్‌ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.

Share