Current Date: 24 Sep, 2024

మాట నిలబెట్టుకున్న అనుష్క ప్రతి ఏడాది ఒక ఐఫోన్‌ను గిప్ట్‌

యాక్టర్‌గానే కాకుండా మంచి మనసు ఉన్న హీరోయిన్‌గా అనుష్క గురించి ఇప్పటికే బోలెడు మంది నటులు చెప్పారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం ఆహలో ఇండియన్ ఐడల్ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న అతను.. అనుష్కతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించాడు.అనుష్క నుంచి ప్రతి ఏడాది ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్లో ఒక ఐఫోన్ గిఫ్ట్ గా వస్తుందట. ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా అదేనట. అనుష్క అంటే తనకి ఇష్టమని, ఆమె ది బెస్ట్ హ్యూమన్ అనుష్క అని పొగిడేసాడు తమన్.భాగమతి సినిమా టైమ్‌లో ఆ మూవీ హిట్ అయితే ఐఫోన్ ఇవ్వాలని తమన్ కోరాడట. దానికి ఓకే చెప్పిన అనుష్క  ఆ మూవీ హిట్ అవడంతో ఇచ్చిన మాట ప్రకారం  ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో తనకు ఒక ఐఫోన్ గిఫ్ట్‌గా పంపుతోందని తమన్ వెల్లడించాడు.ఇప్పుడు అనుష్కతో భాగమతి 2 చేస్తున్నట్టుగా తమన్ ప్రకటించేశాడు. ఆ ఐఫోన్ యూవి ఆఫీస్ నుంచి అనుష్క ద్వారా తన వద్దకు వస్తుందని, ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా అదే అని తమన్ చెప్పుకొచ్చాడు. అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

Share