Current Date: 27 Nov, 2024

జగన్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్

మాజీ ముఖ్యమంత్రి  జగన్  తాడేపల్లి పాలస్ లో ప్రభుత్వ సొమ్ము తో కొనుగోలు చేసిన ఖరీదైన ఫర్నిచర్ విషయ మై వివాదం చెలరేగుతోంది. తాడేపల్లి పాలస్ జగన్ సొంత ఆస్తి. అయితే అందులో  వున్న ఖరీదైన  సామగ్రి  మాత్రం ప్రభుత్వ సొమ్ము తో సమకూర్చింది. వీటి విలువ సుమారు 18 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు.పదవి నుంచి దిగిపోయిన తరువాత స్పీకర్ ద్వారా ఈ సామగ్రిని ప్రభుత్వానికి అప్పగించాల్సి వుంది. అయితే జగన్ ఆ పని ఇప్పటికీ చేయలేదు. గతంలో కోడెల శివప్రసాద్ స్పీకర్ పదవి నుంచి దిగిపోయాక స్పీకర్ కు లేఖ రాసి తన దగ్గరున్న ఫర్నిచర్ వివరాలు ఇచ్చారు. ఆ తరువాత ప్రభుత్వ ఆస్తిని కాజేశారంటూ కోడెల పై కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం వేధించింది. ఇప్పుడు జగన్ మీద కూడా తన తండ్రి మీద పెట్టిన కేసులు పెట్టాలని కోడెల శివప్రసాద్ కుమారుడు డిమాండ్ చేసూన్నారు. అయితే ఆ ఫర్నిచర్ ఖరీదు ఎంతో చెబితే సొమ్ము ఇచ్చేస్తామంటూ వైసీపీ నేత లేళ్ళ అప్పిరెడ్డి చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ఇంట్లో ఫర్నిచర్ వ్యవహారం మీద గట్టి రాద్దాంతమే జరుగుతోంది.

Share