విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ సంబంధిత ఫైలుపై తొలి సంతకం చేశారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు ఫైళ్లు పరిశీలించారు. 16,347 పోస్టుల భర్తీకి విధివిధానాలను క్యాబినెట్ ముందు పెట్టే ఫైల్‌పై తొలి సంతకం పెట్టారు. లోకేశ్‌కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు.