విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టేందుకు సెక్రటేరియట్‌కు వచ్చిన లోకేష్‌కు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి లోకేష్ అడుగు పెట్టారు. ఛాంబర్లో లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతూ ఛాంబర్లోని తన ఛైర్ వద్దకు వెళ్లిన లోకేష్‌కు చైర్‌పై టవల్ వేసి ఉండటం కనిపించింది. టవల్‌ను స్వయంగా తీసేసిన లోకేష్.. ఛాంబర్‌లోనే కాదు.ఎక్కడైనా సరే తన కోసం ప్రత్యేకంగా టవల్స్ వేసిన చైర్లు ఉంచొద్దని అధికారులకు సూచించారు. అందరితో సమానంగానే తననూ చూడాలని ఆదేశించారు.