Current Date: 05 Oct, 2024

రతన్ టాటా.. వేలాది మంది ఉద్యోగులకి టాటా!

దిగ్గజ కంపెనీల్లో ఒకటైన టాటా స్టీల్ షాకింగ్ ప్రకటన చేసింది. 2500 మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. యూకే (బ్రిటన్) కార్యకలాపాల నుంచి ఈ మేర సిబ్బందిని తీసేయనున్నట్లు వెల్లడించింది.యూకేలోని తయారీ విధానంలో సమూలంగా మార్పులు చేస్తున్న నేపథ్యంలోనే ఇలా తప్పట్లేదని పేర్కొంది. ఉద్యోగ కోతల్ని అక్కడి కార్మిక సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాల్ని చేపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగుల్ని తొలగించాలంటే చట్టాలు అడ్డొస్తాయి.భారత్ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్.. బ్రిటన్‌లోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీగా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తోంది. అక్కడ 8 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.  అయితే.. రానున్న మూడు సంవత్సరాల్లో కర్బన ఆధారిత తయారీని యూకేలో పూర్తిగా నిలిపేయాలని టాటా స్టీల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దాంతో 2500 ఉద్యోగాల కోతలు తప్పట్లేదట.