Current Date: 02 Jul, 2024

కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం

కల్కి సినిమా టికెట్ రేట్ల పెంపునకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో రేట్లపై  పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది. ఏఎంబీ మాల్ లాంటి లగ్జరీ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర దాదాపు 500 రూపాయలకు చేరుకోగా.. మిగిలిన మల్టీప్లెక్సుల్లో అటుఇటుగా 430 నుంచి 470 రూపాయల మధ్యలో ఫిక్స్ అయ్యాయి. అటు సింగిల్ స్క్రీన్స్ లో రేట్లు కూడా టికెట్ పై 75 రూపాయల చొప్పున పెరిగాయి.ముంబయిలోని మైసన్ పీవీఆర్ జియో వరల్డ్ డ్రైవ్ ఇన్ లో కల్కి టికెట్ ధర అందర్నీ ఆకర్షిస్తోంది. ఇక్కడ ఒక్కో టికెట్ ధర 2వేల రూపాయలుగా నిర్ణయించారు. అతి తక్కువ సీట్లతో లగ్జరీ సౌకర్యాలు అందించే థియేటర్ ఇది. ముంబయి తర్వాత ఢిల్లీలో అత్యథిక రేట్లు కనిపిస్తున్నాయి. నగరంలోని పీవీఆర్ ఛెయిన్ కు చెందిన ఓ మాల్ లో కల్కి టికెట్ ధర 1850 రూపాయలుంది. ఇదే సిటీలో 1300-1600 రేంజ్ లో కూడా టికెట్లున్నాయి.

 

Share