Current Date: 23 Sep, 2024

రాగల మూడు రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బికనేర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Share